Sunday, March 20, 2011

తెనెలూరెడి తెలుగు తియ్యని తెలుగు


తెలుగువారమండి
 ప. తెలుగువారమండీ మనము తెలుగు వారమండీ
      తెలుగుదనముతో తేజరిల్లిన తెలుగు వారమండీ

 1.  తేనెలూరెడి తెలుగు తియ్యని తెలుగు
      స్వర్ణ కాంతులతో స్వచ్ఛమైన తెలుగు
      సప్త స్వరములతో మధురమైన తెలుగు
      మృదు మధుర భాషణల ముచ్చటైన తెలుగు
      వీనుల విందై విఖ్యాతినొందిన తెలుగు 

 2.  కూచిమంచి తిమ్మకవి  రామాయణము తెలుగు
      నన్నయ తిక్కనల భారతము తెలుగు
      పోతనామాత్యుని భాగవతము తెలుగు
      దిగ్గజమ్ముల దివ్య కావ్యములు తెలుగు
      అది ఇది అన్నియు యెన్నెన్నియో తెలుగు 

 3.  దేశ భాషలలో లెస్సయైన తెలుగు
      దేశదేశముల పరిఢవిల్లిన తెలుగు
      దశదిశల వ్యాపించి దద్దరిల్లిన తెలుగు
      తెలుగు వెలుగే వెలుగు దివ్యకాంతుల తెలుగు
      వేవేల జన్మలకు వెలుగు వెలుగు తెలుగు 

రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం  smkodav@gmail.com
0891 2740744, 0891 2547027, 9989719027